Page Loader
Vettaiyan OTT Release: స్ట్రీమింగ్ కోసం సిద్ధమైన 'వేట్టయన్‌'.. ఎప్పుడంటే!
స్ట్రీమింగ్ కోసం సిద్ధమైన 'వేట్టయన్‌'.. ఎప్పుడంటే!

Vettaiyan OTT Release: స్ట్రీమింగ్ కోసం సిద్ధమైన 'వేట్టయన్‌'.. ఎప్పుడంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2024
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'వేట్టయన్' అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రజనీకాంత్‌తోపాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ చిత్రం నవంబర్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. దీంతో రజనీకాంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.