Page Loader
Rajinikanth : ఆ గుడిలో సూపర్ స్టార్ రజనీకాంత్ దేవుడు.. పూజలు అందుకుంటున్న తలైవార్ 
పూజలు అందుకుంటున్న తలైవార్

Rajinikanth : ఆ గుడిలో సూపర్ స్టార్ రజనీకాంత్ దేవుడు.. పూజలు అందుకుంటున్న తలైవార్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 13, 2023
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు ఆయన విగ్రహానికి పాలభిషేకం చేశారు.తలైవా కోసం కట్టిన గుడిలో విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్ కండెక్టర్ నుంచి సూపర్ స్టార్'గా ఎదిగి ప్రపంచదేశాల్లో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు.73ఏళ్ల వయసులోనూ రజనీ సినిమాలతో అలరిస్తున్నారు. డిసెంబర్ 12న ఆయన జన్మదినం సందర్బంగా సెలబ్రిటీలు,రాజకీయ ప్రముఖులు,అభిమానులు, నెటిజన్లు,ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో రజనీ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ రోజు.మంగళవారం ఆయన ఇంటికి వేలమంది అభిమానులు శుభాకాంక్షలు చెప్పేందుకు తరలివచ్చారు. మరోవైపు ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొంతమంది అభిమానులు మాత్రం రజనీ కోసం కట్టిన గుడిలో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి ఔరా అనిపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుడిలో పూజలు అందుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్