LOADING...
Rakasa OTT: రాకాస ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?
రాకాస ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

Rakasa OTT: రాకాస ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రాకాస' సినిమా ఓటిటి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం మే 1 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వంటి వెబ్‌సిరీస్‌లకు రచయితగా పనిచేసిన మానస శర్మకు ఇదే తొలి సినిమా. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

వివరాలు

కథ ఏమిటంటే

తాను ప్రేమించిన అమ్మాయి కోసం వీరబాబు అలియాస్ వీరు (సంగీత్ శోభన్) అమెరికా నుంచి ఎంతో ఉత్సాహంగా తన ఊరికి వస్తాడు. కానీ, ఫోన్‌లో ప్రేమగా మాట్లాడిన ఆ అమ్మాయి ఇప్పటికే మరొకరితో పెళ్లికి సిద్ధమవుతోందని తెలుసుకుని షాక్‌కు గురవుతాడు. ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో తన స్నేహితుడు బాలు (గెటప్ శ్రీను)తో కలిసి పలు ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో చిన్ననాటి స్నేహితురాలు సుబ్బలక్ష్మి (నయన్ సారిక)ను కలుస్తారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉండగా, ఊరికి సమీపంలో ఉన్న ఒక రాక్షస కోటకు సంబంధించిన భయానక ఆనవాయితీ కథలో కీలకంగా మారుతుంది.

వివరాలు

ఆసక్తికరంగా పాత్రలు

ఆ కోటకు నరబలి ఇస్తేనే ఊరికి శుభం జరుగుతుందనే నమ్మకం అక్కడి ప్రజల్లో బలంగా ఉంటుంది. మూడు సంకేతాల అనంతరం గ్రామస్తులు ఒకరిని ఎంపిక చేసి కోటలోకి పంపిస్తారు. అనుకోని పరిణామాల్లో వీరు ఆ కోటలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? కోటలో ఉన్న రాక్షసుడి అసలు కథ ఏమిటి? వీరును కాపాడేందుకు సుబ్బలక్ష్మి, బాలు చేసిన ప్రయత్నాలు ఎలా ముగిశాయి? అన్నది మిగతా కథలో ఆసక్తికరంగా చూపించారు.

Advertisement