Page Loader
ఓటీటీలోకి వచ్చేసిన సప్త సాగరాలు దాటి: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సప్త సాగరాలు దాటి చిత్రం

ఓటీటీలోకి వచ్చేసిన సప్త సాగరాలు దాటి: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 29, 2023
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడలో విజయం అందుకున్న సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం, సప్త సాగరాలు దాటి సైడ్ ఏ అనే పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. ఈ చిత్ర తెలుగు ప్రమోషన్ల కోసం హీరో రక్షిత్ శెట్టి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పెద్దగా స్పందన రాలేదు. అయితే థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా, ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయింది. అవును, థియేటర్లలో రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈరోజు నుండి సప్తసాగరాలు దాటి సైడ్ ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Details

ఈ సినిమా కథ ఏంటంటే? 

మిడిల్ క్లాస్ కి చెందిన మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వసంత్) ప్రేమించుకుంటారు. వారిద్దరూ పెళ్లి చేసుకుని తమ ఫ్యూచర్ ని హ్యాపీగా గడపాలని అనుకుంటారు. కానీ సడన్ గా మను జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. దానివల్ల మను చిక్కుల్లో పడతాడు. అసలు ఆ సంఘటన ఏంటి? మను, ప్రియా తాము కన్న కలలను నిజం చేసుకుంటారా లేదా అన్నదే సినిమా కథ. ఈ సినిమాను హేమంత్ ఏం రావు డైరెక్ట్ చేశారు. పవిత్రా లోకేష్, అచ్యుత్ కుమార్, అవినాష్ కీలకపాత్రలో నటించారు.