Page Loader
Sandeep Reddy Vanga: స్పిరిట్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్ 
స్పిరిట్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్

Sandeep Reddy Vanga: స్పిరిట్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల వరుసగా అప్డేట్లు వస్తుండగా, తాజాగా హీరోయిన్ ఎంపిక విషయమే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఈ చిత్రంలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తారని వార్తలు వెలువడ్డాయి. అయితే, తాజా సమాచారం మేరకు దీపిక స్థానంలో త్రిప్తి డిమ్రీని అధికారికంగా ఎంపిక చేశారు.

Details

'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఆహార ఉత్పత్తులు

ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టగా, దీపికా కూడా అంతే స్థాయిలో ఓ పోస్ట్ పెట్టడం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ హాట్ టాపిక్ నడుస్తున్న వేళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ - ఉపాసన దంపతులు సందీప్ రెడ్డికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించి వార్తల్లో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన కలిసి 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఆహార ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆవకాయ పచ్చడిని ఈ బ్రాండ్ మెనూలో చేర్చారు.

Details

అవకాయ రుచి అదుర్స్

ఈ స్పెషల్ ఆవకాయ పచ్చడిని ఓ జాడీ రూపంలో సందీప్ రెడ్డికి రామ్ చరణ్ - ఉపాసన పంపారు. ఈ గిఫ్ట్‌కి సంబంధించిన ఫోటోలను సందీప్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రామ్ చరణ్, ఉపాసనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆవకాయ రుచి అదుర్స్ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.