Rakasa: 'రాకాస' టీమ్‌కు రామ్ చరణ్ సపోర్ట్.. రిలీజ్‌కు ముందే పెరిగిన జోష్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై రూపొందిస్తున్న ఫాంటసీ ఎంటర్టైనర్ 'రాకాస' ఏప్రిల్ 3న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న వేళ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' (Peddi) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ సెట్స్‌పై జరుగుతున్న షూటింగ్ మధ్యలోనే 'రాకాస' టీమ్ అక్కడికి వెళ్లగా, చరణ్ వారిని ఆత్మీయంగా స్వాగతించి సరదాగా మాట్లాడారు.
వివరాలు
మా టీమ్‌కు కొత్త ఎనర్జీ: నిహారిక
ఈ సందర్భంగా 'రాకాస' సినిమా గ్లింప్స్, పాటలు వీక్షించిన రామ్ చరణ్, మూవీ టీమ్ పనిని ప్రశంసించారు. ఆయన అభినందనలు అందుకున్న నిహారికతో పాటు హీరో సంగీత్ శోభన్,ఇతర సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చరణ్ నుంచి వచ్చిన ఈ ప్రోత్సాహం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని నిహారిక తెలిపారు. 'మెగా పవర్‌స్టార్ నుంచి వచ్చిన అభినందనలు మా టీమ్‌కు కొత్త ఎనర్జీ ఇచ్చాయి' అంటూ ఆమె తన సంతోషాన్ని పంచుకున్నారు. 'పెద్ది' సినిమా సెట్స్ వద్ద తీసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, మెగా అభిమానులను ఆనందంలో ముంచేస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెద్ది సెట్స్‌లో రాకాస టీమ్ సందడి
పెద్ది రిలీజ్ లేట్ అవట్లేదు అని ప్రమోట్ చేయండి - #RamCharan
— YK Tv Digital (@yktvdigital) April 1, 2026
#Peddi For #Rakasa Movie.. pic.twitter.com/X14wrxe8Sp