Page Loader
Game Changer: డిసెంబర్‌ రెండోవారంలో గేమ్‌ఛేంజర్‌ నాలుగో సింగిల్‌
డిసెంబర్‌ రెండోవారంలో గేమ్‌ఛేంజర్‌ నాలుగో సింగిల్‌

Game Changer: డిసెంబర్‌ రెండోవారంలో గేమ్‌ఛేంజర్‌ నాలుగో సింగిల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 29, 2024
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ,రాజోలు బ్యూటీ అంజలి ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికి శంకర్ టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా విడుదలైన నానా హైరానా లిరికల్ వీడియో సాంగ్‌ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఇప్పటికే విడుదలైన రా మచ్చ, జరగండి జరగండి పాటలు నెట్టింట మంచి క్రేజ్‌ను సంపాదించగా, నాలుగో పాట విడుదల, ట్రైలర్ అప్‌డేట్‌పై వచ్చిన తాజా వార్తలు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.

వివరాలు 

 జనవరి మొదటి వారంలో ట్రైలర్‌

అందుతున్న సమాచారం ప్రకారం, నాలుగో సింగిల్‌ డిసెంబర్‌ రెండో వారంలో విడుదలవుతుంది. ట్రైలర్‌ మాత్రం జనవరి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. రామ్ చరణ్‌, అంజలి కాంబినేషన్‌లో వచ్చే ఈ మెలోడీ సాంగ్‌ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఉంటుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, హ్యారీ జోష్, ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాలుగో సింగిల్‌ డిసెంబర్‌ రెండో వారంలో..