Loading...
Irumudi: 'ఇరుముడి'లో రామ్‌చరణ్‌? అయ్యప్ప పాటపై క్లారిటీ ఇచ్చిన టీమ్‌!
'ఇరుముడి'లో రామ్‌చరణ్‌? అయ్యప్ప పాటపై క్లారిటీ ఇచ్చిన టీమ్‌!

Irumudi: 'ఇరుముడి'లో రామ్‌చరణ్‌? అయ్యప్ప పాటపై క్లారిటీ ఇచ్చిన టీమ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఇందులో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై రామ్‌ చరణ్‌ టీమ్‌ స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

వివరాలు

రామ్‌ చరణ్‌ కనిపించనున్నారంటూ..

'ఇరుముడి'లో 'మల్లెపూల పల్లకి బంగారు పల్లకి' అంటూ సాగే అయ్యప్ప పాటలో రామ్‌ చరణ్‌ కనిపించనున్నారని ఇటీవల సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్‌ అయ్యాయి.

అందులో ఆయన అయ్యప్ప మాలధారణలో దర్శనమివ్వనున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా రామ్‌ చరణ్‌ టీమ్‌ స్పందిస్తూ.. అవన్నీ కేవలం రూమర్స్‌ మాత్రమేనని ఖండించింది.

ఇలాంటి అసత్య ప్రచారాలను చేయొద్దని అభిమానులు, నెటిజన్లను కోరింది. దీంతో 'ఇరుముడి'లో రామ్‌ చరణ్‌ గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారన్న వార్తలకు తెరపడింది.

వివరాలు

పాటతో మొదలైన ప్రచారం..

'ఇరుముడి' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో 'మల్లెపూల పల్లకి' పేరుతో రూపొందిన అయ్యప్ప పాటను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ పాటలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఓ సర్‌ప్రైజ్‌ ఉంటుందని చెప్పారు.

దీంతో ఆ సర్‌ప్రైజ్‌ రామ్‌ చరణే అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. తాజాగా చరణ్‌ టీమ్‌ ఇచ్చిన క్లారిటీతో ఆ వార్తలకు చెక్‌ పడింది.

ADVERTISEMENT

వివరాలు

అయ్యప్ప దీక్ష చుట్టూ కథ..

అయ్యప్ప దీక్ష తీసుకున్న 41 రోజుల సమయంలో కథానాయకుడి జీవితంలో చోటుచేసుకునే పరిణామాల నేపథ్యంలో 'ఇరుముడి' తెరకెక్కుతోంది.

ఈ సినిమా కథ గురించి దర్శకుడు శివ నిర్వాణ ఇటీవల ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి అయ్యప్ప దీక్ష తీసుకోవాల్సి వస్తే.. అతడు 41 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.

అక్కడి నుంచే కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో 'ఇరుముడి'పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

ADVERTISEMENT