పాన్ ఇండియా సినిమాల కోసం ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్న రామ్ చరణ్?
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ యజమానుల్లో ఒకరైన విక్రమ్ తో కలిసి వీ మెగా పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ మొదలవుతుందని వినిపిస్తోంది.
వీ మెగా పిక్చర్స్ బ్యానర్ లో కొత్తవాళ్ళతో సినిమాలను తెరకెక్కిస్తారట. కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారట. అలాగే ఈ బ్యానర్ లో పాన్ ఇండియా సినిమాలను నిర్మించనున్నారట.
నిర్మాణ సంస్థ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం రానుందని అంటున్నారు. 2017లో కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను మొదలెట్టాడు రామ్ చరణ్.
Details
కొణిదెల ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలు
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలు తెరకెక్కాయి.
అదలా ఉంచితే, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
గేమ్ ఛేంజర్ పూర్తి కాగానే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు రామ్ చరణ్. తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని బుచ్చిబాబు తెలియజేసాడు.
ఇవేగాక, హాలీవుడ్ మూవీలో రామ్ చరణ్ నటించనున్నాడని గతంలో వార్తలు. ఆ చిత్ర విశేషాలు అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.