రామ్ చరణ్ బర్త్ డే: బాలీవుడ్ కు సరిపోడన్నారు, హాలీవుడ్ వాళ్ళే పిలుస్తున్నారు
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్.. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిరుత సినిమాతో మెగా పవర్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చి, ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.
ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. మొదట్లో రామ్ చరణ్ పై చాలా విమర్శలు వచ్చాయి. చిరుత, మగధీర, రచ్చ వంటి హిట్లు ఇచ్చినా కూడా విమర్శలు ఆగలేదు.
జంజీర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టినపుడు ఈ విమర్శలు ఇంకా పెరిగాయి. బాలీవుడ్ సరిపోయే నటుడు కాదని విమర్శలు చేసారు.
ఇలా వరుస విమర్శలు వస్తున్న టైమ్ లోనే ధృవ సినిమా వచ్చింది. అందులో రామ్ చరణ్ ఫిజిక్ చూసి షాకైపోయారు. పాత్రకోసం ఆయన పడ్డ కష్టం చూసి, నోరు జారేందుకు తడబడ్డారు.
చెర్రి
రంగస్థలంతో మాయమైన విమర్శలు
ధృవ సినిమా నుండి రామ్ చరణ్ పై విమర్శలు చేస్తున్న వారిలో ఎంతో కొంత మార్పు వచ్చింది. అది పూర్తిగా మారిపోయింది మాత్రం రంగస్థలం సినిమాతోనే.
రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు లేడు. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ఒ దిగిపోయిన తీరు చూసి, ఇక విమర్శలు చేయడానికి ఏమీ లేక నోళ్ళు మూసుకుని ప్రశంసలు చేసేందుకు నోళ్ళు తెరిచారు.
రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రామ్ చరణ్ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాడు కావచ్చు, కానీ రామ్ చరణ్ అనగానే రంగస్థలం గుర్తుకువచ్చేంత ప్రభావం తెచ్చిన సినిమా అది.
రాం చరణ్
ఆర్ఆర్ఆర్ తో ముక్కున వేలేసుకున్న బాలీవుడ్
రంగస్థలం తర్వాత ఆర్ఆర్ఆర్ తో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు రామ్ చరణ్.
ఎన్నో లేయర్స్ ఉన్న పాత్రను అవలీలగా చేసిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తెర మీద చూస్తున్నంత సేపు నోరు తెరిచి ఉండిపోయారంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో జంజీర్ సినిమాకు రామ్ చరణ్ నటనను విమర్శించిన బాలీవుడ్ విమర్శకులు, ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ పాత్రపై ప్రశంసలు కురిపించారు.
ఒక్క బాలీవుడ్ ఏంటి హాలీవుడ్ సైతం రామ్ చరణ్ ను పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం రామ్ చరణ్, హాలీవుడ్ ప్రాజెక్టును కూడా చేయబోతున్నాడు. ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అప్డేట్ రాబోతుంది.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాను చేస్తున్నాడు రామ్ చరణ్.