
Peddi: 60% షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ 'పెద్ది' మూవీ.. రేపటి నుంచి అక్కడ సాంగ్ షూట్
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' సినిమాపై ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమాను బుచ్చిబాబు సానా ఒక ప్రత్యేక శైలి, యూనిక్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ అందింది. ఇప్పటికే మొత్తం షూటింగ్‌లో సుమారుగా 60 శాతం పూర్తి అయ్యింది. ఫస్ట్ హాఫ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని చూసిన సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ సెప్టెంబర్ నెలలో ముగిసినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీమ్ ఒకపక్క సినిమా షూటింగ్ చేస్తూనే, మరోపక్క ఎడిటింగ్ కూడా చేస్తూ, ఎక్కడా లాగ్ లేకుండా చూసుకుంటున్నట్లుగా సమాచారం
వివరాలు
సాంగ్‌లో రామ్ చరణ్‌తో పాటు జాన్వి కపూర్
రేపు 'పెద్ది' సినిమా కోసం ఒక ప్రత్యేక సాంగ్ షూటింగ్ ప్రారంభమవుతోంది. జానీ మాస్టర్ దర్శకత్వంలో ఈ సాంగ్ మహారాష్ట్రలోని పూణేలో చిత్రీకరించబోతున్నారు. సాంగ్‌లో రామ్ చరణ్‌తో పాటు జాన్వి కపూర్ కూడా ఉంటారని సమాచారం. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడని, అందులో ఒక సాంగ్ రేపు షూటింగ్ మొదలు కాబోతోందని అంటున్నారు. ఈ సాంగ్ రేపు షూటింగ్ మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో శివ రాజకుమార్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ది' సినిమాను బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిస్తున్నట్టు, వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నట్లు సమాచారం.