LOADING...
Peddi: 'పెద్ది' సినిమా వాయిదా.. కొత్త డేట్‌ ఇదే
'పెద్ది' సినిమా వాయిదా.. కొత్త డేట్‌ ఇదే

Peddi: 'పెద్ది' సినిమా వాయిదా.. కొత్త డేట్‌ ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీల,రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ తరువాత పవన్-హరీశ్ కలయికలో వచ్చే మూవీ కావడంతో, అభిమానుల్లో పెద్ద అంచనాలు ఏర్పడాయి. తాజాగా, చిత్రబృందం ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. వాస్త‌వానికి ఈ చిత్రం మార్చి 27 విడుద‌ల కావాల్సి ఉంది. అయితే.. తాజాగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లుగా చిత్ర ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ప్ర‌కటించారు. వాయిదా గల కారణాలను ఇంకా వెల్లడించలేదు.

వివరాలు 

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటించిన కొన్ని నిమిషాలకే..

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటించిన కొన్ని నిమిషాలకే, రామ్ చరణ్ సినిమా వాయిదా వేసినట్లు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పెద్ది సినిమాను ఏప్రిల్‌ 30న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో బాబ‌య్ ప‌వ‌న్‌ చిత్రం కోస‌మే చ‌ర‌ణ్ త‌న సినిమాను వాయిదా వేశాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్ న‌డుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉస్తాద్ భగత్ సింగ్  నిర్మాణ సమస్థ చేసిన ట్వీట్ 

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బుచ్చిబాబు చేసిన ట్వీట్ 

Advertisement