LOADING...
Peddi: రామ్ చరణ్ 'పెద్ది'కి అదిరిపోయే శాటిలైట్ డీల్
రామ్ చరణ్ 'పెద్ది'కి అదిరిపోయే శాటిలైట్ డీల్

Peddi: రామ్ చరణ్ 'పెద్ది'కి అదిరిపోయే శాటిలైట్ డీల్

వ్రాసిన వారు Moogati Shabari
May 17, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై ఇప్పటికే భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే ఈ సినిమా వ్యాపార పరంగా మంచి హడావుడి సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కుల ఒప్పందం కూడా పూర్తయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వివరాలు

డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం పోటీ..

'ఆర్ ఆర్ ఆర్' విజయానంతరం రామ్ చరణ్ నటిస్తున్న పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్య కథ కావడంతో 'పెద్ది'పై అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. దీంతో డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం ప్రముఖ సంస్థల మధ్య పోటీ నెలకొంది.

వివరాలు

జీ తెలుగు ద్వారా బుల్లితెరపై సందడి..

ఫిలింనగర్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'పెద్ది' తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానల్ జీ తెలుగు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు కథపై ఉన్న నమ్మకం, అలాగే రామ్ చరణ్ మార్కెట్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందాన్ని భారీ స్థాయిలో పూర్తి చేసినట్లు సమాచారం. థియేటర్లలో ప్రదర్శన ముగిసిన అనంతరం ఈ సినిమా బుల్లితెరపై జీ తెలుగు ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.

Advertisement