Page Loader
Ram Charan: పెద్ది కోసం రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్.. వైరల్ అవుతున్న కండల ఫొటో!
పెద్ది కోసం రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్.. వైరల్ అవుతున్న కండల ఫొటో!

Ram Charan: పెద్ది కోసం రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్.. వైరల్ అవుతున్న కండల ఫొటో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ తన తదుపరి చిత్రం 'పెద్ది' కోసం తన బాడీపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో కనిపించబోయే రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌కు తగ్గట్లుగా బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో మునిగిపోయారు. బలమైన కండలతో కూడిన ఫిజిక్‌ను అభివృద్ధి చేయడం కోసం జిమ్‌లో కష్టపడుతున్నాడు. తాజాగా తన శ్రమ ఫలితాన్ని చూపించేలా ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

Details

వైరల్ అవుతున్న లేటెస్ట్ లుక్ 

సోమవారం (జులై 21) రామ్ చరణ్‌ పోస్ట్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. సైడ్ యాంగిల్‌లో తీసిన ఈ బిల్డ్ లుక్‌లో ఆయన కండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ది కోసం మారే ప్రక్రియ మొదలైంది. స్వచ్ఛమైన ధైర్యం. నిజమైన ఆనందం అనే క్యాప్షన్‌ జత చేశారు చరణ్‌. ఫ్యాన్స్‌ మాత్రం ఈ పోస్ట్‌కు అద్భుత స్పందన ఇస్తున్నారు. లైక్‌లు, కామెంట్లతో సోషల్ మీడియా మోతెక్కింది.

Details

హిట్ కోసం ఆతృత 

2022లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమా రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఆచార్యలో తన తండ్రి చిరంజీవితో కలిసి నటించినా ఫలితం నిరాశపరిచింది. ఇక శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన 'గేమ్ ఛేంజర్' కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది. దీంతో ప్రస్తుతం *పెద్ది* మూవీతో తిరుగులేని హిట్ కొట్టాలని పటిష్టమైన నిశ్చయంతో ఉన్నారు.

Details

 రంగస్థలం తరహా మాస్ క్యారెక్టర్

2018లో వచ్చిన రంగస్థలంలో రూరల్ మాస్ క్యారెక్టర్‌లో చరణ్‌ మేనరిజాన్ని చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి అలాంటి పాత్రలో కనిపించనున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యం, క్రికెట్ నేపథ్యంలో కథ నడవనుందని ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా స్పష్టం అయింది. ముఖ్యంగా చరణ్‌ ఓ శాట్ కొడుతున్న సీన్ నెట్టింట హల్‌చల్ చేసింది.

Details

స్టార్ కాస్ట్, మ్యూజిక్ హైలైట్ 

ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. అలాగే శివరాజ్ కుమార్‌, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2026 మార్చి 27న విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.