Peddi Movie: 'చికిరి చికిరి' హిట్ తర్వాత..'పెద్ది' నుంచి మరో బ్లాస్ట్‌కు మేకర్స్ రెడీ.. ఎప్పుడంటే..
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 'ఉప్పెన'తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తుండటంతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన తొలి పాట 'చికిరి చికిరి' ప్రేక్షకులను ఊపేసిన సంగతి తెలిసిందే. ఆ విజయంతో జోష్‌లో ఉన్న చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట విడుదలకు సన్నాహాలు చేస్తోంది.
వివరాలు
14న విడుదలకు మేకర్స్ ప్లాన్
ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు,'పెద్ది' రెండో పాటను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈగీతం సినిమాలో రామ్‌చరణ్ పాత్రను పరిచయం చేసే పవర్‌ఫుల్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా ఉండబోతుందని టాక్. చరణ్ మాస్ ఎనర్జీ, పాత్ర బలాన్ని మరింత ఎలివేట్ చేసేలా ఈ పాటను సంగీత దర్శకుడు A.R. Rahman స్వరపరిచారని సమాచారం. అంతేకాదు,ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు డాన్స్‌లను రూపొందించడంతో అంచనాలు ఇంకాస్త పెరిగాయి. చరణ్ డాన్స్ స్టెప్పులు అభిమానులకు నిజమైన విందుగా నిలవనున్నాయని ఇండస్ట్రీలో మాట వినిపిస్తోంది. వాస్తవానికి ఈ పాటను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
వివరాలు
ఇప్పటికే తొలి పాట 'చికిరి చికిరి' యూట్యూబ్‌లో సంచలనం
ఇప్పుడు వాలంటైన్స్ డేకు విడుదల చేయాలనే నిర్ణయం సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ పాట అభిమానులకు ఒక పెద్ద బ్లాస్ట్‌లా ఉంటుందని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. RRR తర్వాత రామ్‌చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'పెద్ది'పై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన'చికిరి చికిరి' పాట తెలుగులోనే 150మిలియన్లకు పైగా,అన్ని భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, జగపతిబాబు, శివ రాజ్‌కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.