LOADING...
Ram Charan: రామ్ చరణ్ సింప్లిసిటీ.. ఇండియా వచ్చిన జపాన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్!
రామ్ చరణ్ సింప్లిసిటీ.. ఇండియా వచ్చిన జపాన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్!

Ram Charan: రామ్ చరణ్ సింప్లిసిటీ.. ఇండియా వచ్చిన జపాన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జపాన్‌లోని తన అభిమానుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకుముందు చరణ్‌పై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతర్జాతీయ స్థాయిలో తెలుసు. తాజాగా కొందరు జపనీస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా భారతదేశం వరకు వచ్చి ఆయనను కలుసుకోవడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్, ఈ విషయం తెలుసుకొని వారిని వ్యక్తిగతంగా ఆహ్వానించి సమయాన్ని గడిపారు. అభిమానులతో సరదాగా మాట్లాడటమే కాక, ఫొటోలు దిగడం ద్వారా ఆయన ఆప్యాయతను, సింప్లిసిటీని చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది,

Details

 రామ్ చరణ్ పై నెటిజన్లు ప్రశంసలు

నెటిజన్లు రామ్ చరణ్ ప్రవర్తనకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తరువాత 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర యూనిట్ త్వరలోనే డెల్లీకి పయనించనుంది. అక్కడ అత్యంత కీలకమైన యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు బుచ్చిబాబు సాన భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయినుగా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాక ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించటం వల్ల సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement