LOADING...
RC 17 : రామ్ చరణ్ - సుకుమార్ మూవీ షూటింగ్‌కు మరింత ఆలస్యం?
రామ్ చరణ్ - సుకుమార్ మూవీ షూటింగ్‌కు మరింత ఆలస్యం?

RC 17 : రామ్ చరణ్ - సుకుమార్ మూవీ షూటింగ్‌కు మరింత ఆలస్యం?

వ్రాసిన వారు Moogati Shabari
Jun 21, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

'రంగస్థలం'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్సీ 17 వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. 'పుష్ప'తో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న సుకుమార్, ఈసారి చరణ్‌తో మరింత భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథను మరింత బలంగా తీర్చిదిద్దే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నారు. కథ విషయంలో ఇప్పటికే పలుమార్లు రామ్ చరణ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథ దాదాపు తుది దశకు చేరుకున్నప్పటికీ, సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం వెంటనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

వివరాలు

మూడు నెలల పాటు చరణ్‌కు పూర్తి విశ్రాంతి..

దీనికి ప్రధాన కారణం రామ్ చరణ్‌కు ఇటీవల జరిగిన గాయమేనని సమాచారం. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ఆయన చేతికి గాయం కావడంతో త్వరలోనే శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. సర్జరీ అనంతరం కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని సమాచారం. ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటూ సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

ఏర్పాట్లన్నింటినీ దసరా నాటికి పూర్తి..

కథను ఫైనల్ చేయడం, షూటింగ్ లొకేషన్ల ఎంపిక, సాంకేతిక బృందంతో పాటు ఇతర ఏర్పాట్లన్నింటినీ దసరా నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. అన్ని పనులు పూర్తయ్యాక దసరా శుభ సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాలపై అధికారిక స్పష్టత రావాలంటే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఎప్పుడైనా విడుదలైనప్పటికీ ఆర్సీ 17 బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని అభిమానులు, సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement