తదుపరి వార్తా కథనం

Ram Charan: కూతూరుతో రామ్ చరణ్.. క్రిస్మస్ సందర్భంగా ఫోటోను పంచుకున్న ఉపాసన
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 26, 2023
05:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
మెగా, అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి క్రిస్మస్ వేడుకులను ఘనంగా జరుపుకున్నారు.
అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు వెంకట్, ఉపాసన, లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారిక, స్నేహారెడ్డి తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
అయితే చరణ్, ఉపాసాన ముద్దుల కూతురు క్లీంకారను కూడా ఈ సెలబ్రేషన్స్‌కు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా తన కూతురితో దిగిన ఫోటోను ఉపాసన షేర్ చేశారు. 'బెస్ట్ డ్యాడ్' ఆ ఫోటోకు ఉపాసన క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఈ ఫోటోలు వైరల్ కావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫోటోను షేర్ చేసిన ఉపాసన
Merry Christmas ❤️❤️❤️@AlwaysRamCharan Best dad 🤗 pic.twitter.com/fKnkZIVQ6z
— Upasana Konidela (@upasanakonidela) December 26, 2023