Ram Gopal Varma: టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు..!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆరేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మెడకు చుట్టుకుంది.
అప్పటి కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది.
ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది.
ఆర్టీవీకి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఏమైంది అంటే...
వివరాలు
2018లో ముంబైలో చెక్‌బౌన్స్ కేసు
రాంగోపాల్ వర్మపై 2018లో ముంబైలో చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. అప్పట్లో మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి, శ్రీ అనే కంపెనీ పేరుతో రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేశాడు.
ఈ కేసు గత ఏడేళ్లుగా విచారణ దశలో ఉంది. ఈ క్రమంలో కోర్టు పలుమార్లు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చినా, వర్మ ఒక్కసారైనా కోర్టుకు హాజరుకాలేదు.
దీంతో కోర్టు ఆగ్రహించి అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఈ కేసులో పరిహారం చెల్లించని పక్షంలో ఆర్జీవీని మూడు నెలల పాటు సాధారణ జైలులో పంపించాలని కోర్టు ఆదేశించింది.
వర్మకు రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు నిర్ణయించింది.
వివరాలు
"సిండికేట్" అనే కొత్త సినిమా
ఇక సినిమాల విషయానికొస్తే... ఒకప్పుడు బాగా పాపులర్ అయిన రాంగోపాల్ వర్మ ప్రస్తుతం నాసిరకం సినిమాలు చేయడం వల్ల వరుస ప్లాఫులు మూటగట్టుకుంటున్నాడు.
అతను చేసే సినిమాలు హిట్స్ లేదా ప్లాఫ్‌ల కంటే ఎక్కువగా వివాదాలకు కారణమయ్యాయి.
తాజాగా, తన ప్రవర్తనపై, తాను తీస్తున్న సినిమాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు.
''సత్య'' సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని, ఇకపై తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని ప్రకటించాడు.
"సత్య" సినిమాను తన ప్రమాణంగా తీసుకుని, "సిండికేట్" అనే కొత్త సినిమాను తీస్తున్నట్టు ప్రకటించాడు.
ఈ కొత్త సినిమా కథ,ఇందులో నటించే వారు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.