LOADING...
Andhra King Taluka OTT: ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలుకా! సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు,ఎక్కడంటే? 
సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు,ఎక్కడంటే?

Andhra King Taluka OTT: ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలుకా! సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు,ఎక్కడంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్‌ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే ప్రధాన జంటగా రూపొందిన తాజా చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా'. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో విజయాన్ని అందుకున్న దర్శకుడు పి. మహేశ్ బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో కనిపించగా,రావు రమేష్,మురళీ శర్మ,రాజీవ్ కనకాల, తులసి,సింధు తులానీ,రాహుల్ రామకృష్ణ,సత్య,వీటీవీ గణేష్ వంటి పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ అంచనాలతో,అధిక బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ అంచనాలకు తగ్గట్టే నవంబర్ 27న విడుదలైన వెంటనే సినిమాకు మంచి స్పందన లభించింది.

వివరాలు 

బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాని సినిమాల్లో ఇది ఒకటి

ముఖ్యంగా కథ, కథనాలు ఆసక్తిని రేకెత్తించాయి; రామ్‌ ఇచ్చిన ఎనర్జిటిక్‌ పెర్ఫార్మెన్స్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. పాటలూ కూడా చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. అయితే, పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈ మధ్య కాలంలో మంచి టాక్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాని సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. థియేటర్లలో యావరేజ్‌ రేంజ్‌లో నడిచిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందన్న సమాచారం బయటకు వచ్చింది. 'ఆంధ్రా కింగ్ తాలూకా'మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ ఫ్లిక్స్‌ అందుకున్నట్టు తెలిసింది. క్రిస్మస్‌ సందర్భంగా,అంటే డిసెంబర్ 25, 2025న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది.

వివరాలు 

ప్లస్ పాయింట్స్‌గా భాగ్యశ్రీ అందం, సినిమా పాటలు

టైటిల్‌తోనే ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ సినిమాలో రామ్‌ ఫ్యాన్ పాత్రలో ఆకట్టుకునే నటన కనబర్చాడు. అలాగే సూర్య కుమార్‌గా ఉపేంద్ర కనిపించే కొద్ది నిమిషాల పాత్ర అయినప్పటికీ, ప్రేక్షకులను బాగా రిజిస్టర్ అయ్యింది. భాగ్యశ్రీ అందం, సినిమా పాటలు మొత్తం చిత్రానికి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఓ మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కిన ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాకు సుమారు రూ. 30 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. థియేటర్లలో మోస్తరు స్థాయిలో నడిచిన ఈ చిత్రం ఓటీటీలో అయితే ఎలా స్పందన అందుకుంటుందో ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది.

Advertisement