LOADING...
Ram Pothineni New Movie: భారీ బడ్జెట్‌తో రామ్ మూవీ.. కొత్త డైరెక్టర్‌తో సర్ప్రైజ్!
భారీ బడ్జెట్‌తో రామ్ మూవీ.. కొత్త డైరెక్టర్‌తో సర్ప్రైజ్!

Ram Pothineni New Movie: భారీ బడ్జెట్‌తో రామ్ మూవీ.. కొత్త డైరెక్టర్‌తో సర్ప్రైజ్!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 25, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ఇటీవల 'ఆంధ్రా కింగ్ తాలుకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, అది ప్రేక్షకులను నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా విడుదలైన తర్వాత నుంచి రామ్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌పై ఎలాంటి స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. ఈ విరామ సమయంలో ఆయన పలువురు దర్శకుల కథలను వినడమే కాకుండా, స్వయంగా ఒక కథను కూడా సిద్ధం చేసుకున్నారని వినికిడి. అయినప్పటికీ, ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ కూడా అధికారికంగా ఖరారు కాలేదు.

వివరాలు 

లోకేష్ శిష్యుడితో మూవీ..

ఈ పరిస్థితుల్లోనే, రామ్ పోతినేని తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ వద్ద పనిచేసిన శిష్యుడు లోగి విఘ్నేశ్ చెప్పిన కథ రామ్‌కు నచ్చిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థపై స్పష్టత వచ్చిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

యాక్షన్ థ్రిల్లర్‌గా కొత్త చిత్రం..

ఈ కొత్త చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. భారీ వ్యయంతో, ఆకర్షణీయమైన నిర్మాణ శైలిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో రామ్ పోతినేని కొత్త లుక్‌లో కనిపించే అవకాశం కూడా ఉందని టాక్. మొత్తంగా రామ్ తదుపరి చిత్రంపై నెలకొన్న సందేహం త్వరలోనే తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో అయినా రామ్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన ప్రతిభను నిరూపించుకుంటాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement