Page Loader
రామ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవికిషోర్ 
రామ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవికిషోర్

రామ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవికిషోర్ 

వ్రాసిన వారు Stalin
Nov 08, 2023
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో రామ్ పోతినేని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటూ టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై రామ్ పెద్దనాన్న, త్రివిక్రమ్ శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేసిన నిర్మాత స్రవంతి రవికిషోర్ క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్‌తో మళ్లీ కలిసి కలసి చేయాలని తనకు ఉందన్నారు. త్రివిక్రమ్, రామ్ పోతినేని కాంబోలో సినిమా తప్పకుండా వస్తుందని స్పష్టం చేశారు. స్రవంతి రవికిషోర్ నిర్మించిన 'దీపావళి' సినిమా నవంబర్ 11న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ష్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్రవంతి రవికిషోర్ మాట్లాడారు. ఈ ప్రచార కార్యక్రమంలోనే రామ్ పోతినేని, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి కూడా వ్యాఖ్యానించారు.

సినిమా

స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది: రవికిషోర్

రామ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నానని అయితే అది కార్యరూపం దాల్చలేదని రవికిషోర్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పారు. త్రివిక్రమ్‌కి అనేక కమిట్‌మెంట్‌లు ఉన్నాయని, రామ్‌కి సరిపోయే స్క్రిప్ట్ సిద్ధమైనప్పుడు ప్రాజెక్ట్ కచ్చితంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వీరి కాంబినేషన్ కోసం తాను చాలా ప్రయత్నిస్తున్నానని వివరించారు. దీపావళి గురించి రవికిషోర్ మాట్లాడుతూ.. దర్శకుడు ఆర్‌ఎ వెంకట్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. ఈ చిత్రం ప్రీమియర్ షో తర్వాత దిల్ రాజు తనను అభినందించారని పేర్కొన్నారు. చెన్నైలోని 200 మంది మీడియా స్నేహితులు ప్రీమియర్స్ తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారని రవి కిషోర్ చెప్పారు.