Vishwambhara: విశ్వంభర నుంచి 'రామ రామ' సాంగ్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'విశ్వంభర' నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ 'రామ రామ' ను మేకర్స్ విడుదల చేశారు.
సంగీతానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సారథ్యం వహించగా, ఈ పాటకు ప్రసిద్ధ గీత రచయిత సరస్వతిపుత్ర రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు.
శంకర్ మహాదేవన్, లిప్సికా ఈ గీతాన్ని ఆలపించారు. ఈ సాంగ్ శ్రవణభరితంగా, వినసొంపుగా ఉండటంతో పాటు, శ్రోతలను అలరించేలా ఉంది.
పాటలో శ్రీరాముడి మహాత్మ్యాన్ని హృద్యంగా వర్ణించారు. చిరంజీవి తనదైన స్టైల్, ఎనర్జీతో ఈ పాటకు డ్యాన్స్ చేసిన విధానం, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని స్పష్టంగా కనిపిస్తోంది.
Details
రామ రామ సాంగ్ కు అద్భుత స్పందన
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష మరియు ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
సోషియో ఫాంటసీ బ్యానర్‌లో రూపొందుతున్న 'విశ్వంభర'కు కీరవాణి సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించగా, ఇప్పుడు వచ్చిన 'రామ రామ' పాట ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.