Ramayana: రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్..! 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
యుగాలు మారినా,తరాలు మారినా.. వినగానే భక్తితో మనసు ఓలలాడే శాశ్వత కావ్యం..రామాయణం. ఇప్పుడు అదే కథను బాలీవుడ్ 'రామాయణ' సినిమాగా మనముందుకు తెస్తోంది. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వివరాలు
2500 కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తూ వస్తున్న అమర కావ్యం
తాజాగా ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.ఈ వీడియోలో,''ముల్లోకాలను త్రిమూర్తులు పరిపాలిస్తున్నారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు రక్షకుడు,శివుడు లయకారుడు.అయితే, వారు నిర్మించిన ఈ మూడు లోకాలపై అధికారం కోసం ఒకడు తిరుగుబాటు చేసినపుడు,ప్రతి యుద్ధానికి ముగింపు పలికే ఒక మహాయుద్ధం ఆరంభమైంది. ఐదు వేల సంవత్సరాలుగా 2500 కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తూ వస్తున్న అమర కావ్యం ఇది. ఇది కేవలం ఒక ఇతిహాసం కాదు.. మన వాస్తవం.. మన చరిత్ర'' అనే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ ప్రదర్శితమైంది. ఈ చిత్రంలో మరికొన్ని ముఖ్య పాత్రలు కూడా నటిస్తున్నాయి. లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ దియోల్ తమ తమ పాత్రలతో అలరించనున్నారు.