Page Loader
Ramayana : రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న  బాలీవుడ్ 'రామాయణ' పార్ట్ 2 అప్‌డేట్ ! 
బాలీవుడ్ 'రామాయణ' పార్ట్ 2 అప్‌డేట్ !

Ramayana : రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న  బాలీవుడ్ 'రామాయణ' పార్ట్ 2 అప్‌డేట్ ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటి వరకు తెలుగు సహా ఇతర భాషల్లో ఎన్నోసార్లు రామాయణ ఇతిహాసం సినిమాలుగా, సీరియల్స్‌ రూపంలో మనం చూశాము. చిన్నప్పటి నుంచి రామాయణాన్ని ఎన్నో విధాలుగా తెరపై వీక్షిస్తూ వచ్చాం. కానీ కొత్త తరానికి ఈ అద్భుత కథను మరో కోణంలో, వినూత్నంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో తాజాగా పలువురు దర్శకులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ తరం పిల్లలు నుంచి పెద్దవారి వరకు అందరూ ఆసక్తితో ఈ ప్రయత్నాలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవ‌ల ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్‌' రామాయణ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే, ఆ చిత్రం తగిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అంతేకాకుండా, రామాయణాన్ని వక్రీకరించారన్న విమర్శలూ గట్టిగానే వినిపించాయి.

వివరాలు 

రావణునిగా 'కేజీఎఫ్‌' ఫేమ్ యశ్‌

ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు మరోసారి రామాయణం కథపై ఆధారితమైన ప్రాజెక్ట్‌ మొదలవుతోంది. ఈసారి ఇది బాలీవుడ్ లో ఇండియాలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రను పోషించనుండగా, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. రావణునిగా 'కేజీఎఫ్‌' ఫేమ్ యశ్‌ కనిపించనున్నారు. సుర్పణకా పాత్రకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంపిక కాగా, బాబీ డియోల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

వివరాలు 

మే నెల చివరిలో 'రామాయణ పార్ట్ 2' షూటింగ్ ప్రారంభం

ప్రస్తుతం ఈప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి పార్ట్‌ చిత్రీకరణ వేగంగా సాగుతూ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో,రెండో భాగానికి సంబంధించిన ఒక ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం,ఈ సంవత్సరం మే నెల చివరిలో 'రామాయణ పార్ట్ 2' షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటగా సీత పాత్రకు సంబంధించిన అశోకవనం ఎపిసోడ్‌ చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత జూన్ నుండి రణ్‌బీర్ నటించే రాముడి పాత్ర సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, రణ్‌బీర్ - సాయిపల్లవిలపై రెండు పాటలను కూడా ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరించనున్నారు. ఈభారీ ప్రాజెక్ట్‌లో మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుండగా,రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇంకా అనేక వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రావణునిగా 'కేజీఎఫ్‌' ఫేమ్ యశ్‌