LOADING...
Ramayana : గేట్‌వే ఆఫ్ ఇండియా వేదికగా 'రామాయణం' ఫస్ట్ లుక్ రివీల్.. భారీగా ఈవెంట్ ప్లాన్
గేట్‌వే ఆఫ్ ఇండియా వేదికగా 'రామాయణం' ఫస్ట్ లుక్ రివీల్.. భారీగా ఈవెంట్ ప్లాన్

Ramayana : గేట్‌వే ఆఫ్ ఇండియా వేదికగా 'రామాయణం' ఫస్ట్ లుక్ రివీల్.. భారీగా ఈవెంట్ ప్లాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో బాలీవుడ్ 'రామాయణం' ఒకటిగా నిలవనుంది. భారతీయ పురాణ ఇతిహాసమైన రామాయణాన్ని మునుపెన్నడూ లేని స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు నితేష్ తివారీ భారీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు సుమారు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు అవుతుండగా, ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఈ చిత్రంలో మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతాదేవిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్‌లో అడుగుపెట్టడం విశేషంగా మారింది.

Details

హనుమంతుడిగా సన్నీ డియోల్

మరోవైపు రావణుడి పాత్రలో కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇంకా హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, దశరథ మహారాజుగా అరుణ్ గోవిల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్‌ను ఆస్కార్ అవార్డు విజేత సంస్థ DNEG నిర్వహిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ ప్లాన్‌ను కూడా ఫిక్స్ చేశారు. 'రామాయణం పార్ట్-1'ను 2026 దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను కూడా సిద్ధం చేశారు.

Details

మార్చి 27న ఈవెంట్

దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాల కోసం వారణాసి వంటి పుణ్యక్షేత్రాల్లో గ్రాండ్ ఈవెంట్స్ నిర్వహించిన తరహాలోనే, నితేష్ తివారీ టీమ్ కూడా భారీ స్థాయిలో ప్రచారం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని ఐకానిక్ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఒక భారీ వేడుకను ప్లాన్ చేశారు. మార్చి 27న, శ్రీరామనవమి సందర్భంగా ఈ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ సహా ప్రధాన తారాగణం అందరి ఫస్ట్ లుక్స్‌ను ఒకేసారి రివీల్ చేయనున్నారు.

Advertisement

Details

రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం

'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాలకు రాజమౌళి నేషనల్ లెవల్‌లో ఏ విధంగా హైప్ క్రియేట్ చేశారో, అదే స్థాయిలో ఈ సినిమాకు కూడా ప్రమోషన్స్ చేయాలని నితేష్ తివారీ టీమ్ ప్లాన్ చేస్తోందని టాక్. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి రాజమౌళి మార్క్ ప్రమోషన్ స్ట్రాటజీని తలపించే ఈ ప్రచారం 'రామాయణం' సినిమాకు ఎంత స్థాయిలో మైలేజ్ ఇస్తుందో చూడాల్సి ఉంది.

Advertisement