Loading...
Ramayana Trailer: చివరి నిమిషంలో 'రామాయణ' ట్రైలర్ వాయిదా.. మేకర్స్ చెప్పిన అసలు కారణం ఇదే!
చివరి నిమిషంలో 'రామాయణ' ట్రైలర్ వాయిదా.. మేకర్స్ చెప్పిన అసలు కారణం ఇదే!

Ramayana Trailer: చివరి నిమిషంలో 'రామాయణ' ట్రైలర్ వాయిదా.. మేకర్స్ చెప్పిన అసలు కారణం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను నేడు విడుదల చేయాలని చిత్రబృందం ముందుగా నిర్ణయించినప్పటికీ.. చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ట్రైలర్ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా వెల్లడించారు.

వివరాలు 

వాయిదాకు కారణం ఇదే..

ట్రైలర్ విడుదల వాయిదా నేపథ్యంలో నమిత్ మల్హోత్రా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు. 'రామాయణ' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలన్న తన కల ఇప్పుడు సాకారమవుతోందని పేర్కొన్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్లోబల్ భాగస్వామిగా చేరిందని ఆయన వెల్లడించారు.

ఈ భాగస్వామ్యంతో భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని, హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 'రామాయణ'ను విడుదల చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

అందుకే ట్రైలర్‌ను కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం వాయిదా వేస్తున్నామని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నమిత్ మల్హోత్రా స్పష్టం చేశారు.

వివరాలు 

భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం

'రామాయణ' కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అరుదైన అవకాశమని నమిత్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచిన అభిమానులు, తమపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

భారత యువతే దేశ భవిష్యత్తని పేర్కొంటూ.. మన సంస్కృతి, విలువలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తన సందేశంలో వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న 'రామాయణ'

దర్శకుడు నితీశ్ తివారీ రూపొందిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి సీతాదేవిగా కనిపించనున్నారు.

యశ్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. రూ.4,000 కోట్ల మెగా ప్రాజెక్ట్.. రెండు భాగాలుగా విడుదల సుమారు రూ.4,000 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న 'రామాయణ' చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

మొదటి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT