Page Loader
భర్త ఆచూకీ వెతుకుతున్న దీపికా పదుకొణె.. వెతికిపెట్టే పనిలో రామ్ చరణ్ 
భర్త ఆచూకీ వెతుకుతున్న దీపికా పదుకొణె.. వెతికిపెట్టే పనిలో రామ్ చరణ్

భర్త ఆచూకీ వెతుకుతున్న దీపికా పదుకొణె.. వెతికిపెట్టే పనిలో రామ్ చరణ్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 03, 2023
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ నాయకి దీపికా పదుకొణె వ్యక్తిగత ప్రాజెక్ట్‌లల్లో బిజీ బీజీగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటించిన విజువల్స్ తాజాగా వైరలయ్యాయి. షో మీ ది సీక్రెట్ పేరుతో ఓ వీడియో ఆన్‌లైన్‌లో సంచలనంగా మారింది. తప్పిపోయిన భర్త ఆచూకీ కోసం దీపికా పదుకొణె పోలీసులను ఆశ్రయించినట్లు ఈ వీడియోలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్త హీరో రణవీర్ సింగ్ దీపికా అదృశ్యమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అదృశ్యంపై ఉన్న మిస్టరీని ఛేదించే బాధ్యతను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నట్లు ఉంది.

DETAILS

సీక్రెట్ ఏజెంట్‌ పాత్ర పోషించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఈ ఆసక్తికరమైన వీడియోలో రామ్ చరణ్ సీక్రెట్ ఏజెంట్‌ పాత్ర పోషించాడు. ఈ వీడియోలో మరో పాత్రలో త్రిష కృష్ణన్ కూడా కనిపించడం విశేషం. ఇంతకీ దీపికా భర్తకు ఏమైంది ? ఈ కేసులో రామ్ చరణ్ ఎందుకు భాగమయ్యారు ? అలాగే త్రిష ఎవరు ? లాంటి ప్రశ్నలకు జూలై 5న సమాధానాలు వెల్లడవుతాయని చిత్ర నిర్మాణ బృందం స్పష్టం చేసింది. అయితే సదరు వీడియో ఓ బ్రాండ్ కోసం చేసిన యాడ్ గా సమాచారం. మరోవైపు తమ అభిమాన హీరోని దీపికా పదుకొణెతో కలిసి వెండితెరపై చూడాలన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలోనే సమీప భవిష్యత్ లో ఫ్యాన్స్ కోరికను ఈ మెగా హీరో నెరవేరుస్తారో లేదో వేచిచూడాలి.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

బ్రాండ్ కోసం రాంచరణ్, దీపికా పదుకొనే  చేసిన యాడ్