Game Changer : రామ్'చరణ్ అభిమానులను ఖుషీ చేస్తున్న కమల్ హాసన్ ..'గేమ్ ఛేంజర్'కు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్' అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ మేరకు గేమ్ ఛేంజర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
ఎంత పెద్ద దర్శకుడైనా ఒకేసారి ఇద్దరు బడా హీరోలతో సినిమాలు చేయడం కష్టమే. ఫలితంగా ఒక హీరోతో సినిమా పూర్తయ్యి అది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాతే మరో స్టార్ సినిమా గురించి ఆలోచించగలుగుతారు.
కానీ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ మాత్రం గత కొంతకాలంగా రెండు పడవలపై ప్రయాణం చేస్తూ వచ్చాడు.
ఒకవైపు కమల్ హాసన్ 'ఇండియన్ 2' షూటింగ్‌ను మరోవైపు రామ్ చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' షూటింగ్‌ను ఒకేసారి చేసేందుకు ఆయన ప్రయత్నించారు.
Details
ఇక ఆ సినిమాలపైనే పూర్తిగా దృష్టి
కానీ 'ఇండియన్ 2' మేకర్స్ ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'కు లైన్ క్లియర్ అని తెలుస్తోంది.
నజర్ అంతా షూటింగ్‌పైనే
1996లోనే పొలిటికల్ థ్రిల్లర్‌గా 'భారతీయుడు'ను తెరకెక్కించిన దర్శకుడు శంకర్, భారీ విజయాన్ని అందుకున్నాడు.
సీక్వెల్ 'ఇండియన్ 2' ప్రకటన వచ్చినప్పట్నుంచి షూటింగ్‌కు పలుమార్లు బ్రేక్ పడుతూనే ఉంది.
షూటింగ్ రీస్టార్ట్ అయ్యాక 'ఇండియన్ 2', ఇండియన్ 3' ఒకేసారి పూర్తి చేయాలని దర్శకుడు భావించారు.
ప్రస్తుతం 'ఇండియన్ 2' షూటింగ్‌పై అంతా దృష్టి కేంద్రీకరించారు.ఒక్క పాటను షూట్ చేస్తే 'ఇండియన్ 2' షూటింగ్ మొత్తంగా పూర్తయినట్టేనని తెలుస్తోంది.
దీని తర్వాత 'ఇండియన్ 3' షూటింగ్ ప్రారంభించి ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట.
Details
రామ్ చరణ్ ఫ్యాన్స్ హ్యాపీ
'ఇండియన్ 2', 'ఇండియన్ 3' షూటింగ్'పై క్లారిటీ రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు.
త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుంటే 'గేమ్ ఛేంజర్' సెట్స్ మీదకు వెళ్లనున్నందని సమాచారం.
ఇప్పటికే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లోని 'గేమ్ ఛేంజర్' మూవీ కొన్నాళ్లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంది.
కానీ 'ఇండియన్ 2'కు కలిగిన ఇబ్బందుల దృష్ట్యా వల్ల శంకర్ వెంటనే అటు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఫైనల్‌గా కమల్ హాసన్ మూవీ అప్డేట్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
ఇండియన్ ఫ్రాంచైజ్‌లో మరోసారి కమల్ హాసన్ సేనాపతి అనే పాత్రలో కనిపించనున్నారు.ఈ సీక్వెల్స్ కచ్చితంగా ఏదో ఒక సోషల్ మెసేజ్‌తోనే ప్రేక్షకులను అలరిస్తాయని శంకర్ అభిమానులు అంచనా వేస్తున్నారు.