
ఇండియాలో హాలీవుడ్ సృష్టిస్తానంటున్న రానా
ఈ వార్తాకథనం ఏంటి
సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న నిజం విత్ స్మిత టాక్ షో ప్రోగ్రామ్ కి అతిధిగా వచ్చిన రానా దగ్గుబాటి, భారతీయ సినిమా గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. సింగర్ స్మిత వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న షోలోకి నాని తో పాటు వచ్చారు రానా.
ఇందులో రానా మాట్లాడుతూ, భారతదేశంలోని అన్ని ప్రాంతాల ఇండస్ట్రీలను ఒకదగ్గరకు చేర్చి ఇండియాలో హాలీవుడ్ సృష్టించాలనుందని చెప్పుకొచ్చాడు.
ఆ ప్రోగ్రామ్ లో ఒకానొక అభిమాని, హాలీవుడ్ ప్రయాణానికి మీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఎలా ఉపయోగపడుతుందని అడగడంతో, అప్పట్లో తీసిన సినిమాల నుండి ఇప్పుడు తీస్తున్న సినిమా జ్ఞానం వరకూ తనకుందనీ, సినిమా బిజినెస్ ఎలా జరుగుతుందో అవగాహన ఉందనీ, అందుకే అన్ని ఇండస్ట్రీలను ఒకే దగ్గరకు తీసుకొస్తానని చెప్పాడు.
రానా
11ఏళ్ళ కింద చెప్పిన మాట నిజమైందంటున్న రానా
అన్ని ప్రాంతీయ భాషల ఇండస్ట్రీలను కలిపితే ఇక్కడే హాలీవుడ్ నిర్మించవచ్చని చెప్పాడు. అదీగాక, తన మొదటి హిందీ సినిమా ధమ్ మారో ధమ్ (2011) రిలీజైన సమయంలో..
అన్ని భాషల వాళ్ళు ఒకేతాటి మీదకు వస్తారని అప్పుడే చెప్పానని, కానీ అప్పుడెవరూ నమ్మలేదని, అది చెప్పి కూడా 11ఏళ్ళు అవుతుందని, ప్రస్తుతం అది జరుగుతుందని రానా చెప్పారు.
రానా దగ్గుబాటి ప్రస్తుతం రానా నాయుడు సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో రానాతో పాటు హీరో వెంకటేష్ కూడా ఉన్నారు. ఈ సిరీస్, మార్చ్ 10వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
రే డానోవన్ అనే టీవీ సిరీస్ ని రానా నాయుడుగా రీమేక్ చేసారు.