LOADING...
Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది!

Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్‌సిరీస్‌ 'రానా నాయుడు' బోల్డ్ కంటెంట్ కారణంగా మొదటి సీజన్‌ విమర్శల పాలైనా, యువతలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఆ సిరీస్‌కు కొనసాగింపుగా 'రానా నాయుడు సీజన్‌ 2' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సీరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సీజన్‌ అందుబాటులోకి రానుంది. తాజాగా సీజన్‌ 2 ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ మంగళవారం విడుదల చేసింది.

Details

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇది చూసినవారిలో హైప్‌ పెరిగింది. ఈ సీజన్‌ ముందున్న సీజన్‌కంటే మరింత ఇంటెన్స్, థ్రిల్లింగ్, ఎమోషనల్ డ్రామాతో కూడినదిగా రూపొందినట్లు ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ మీడియా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సీజన్‌లో అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్బంద, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీజన్‌ తొలి సీజన్‌కు మించిన అనుభూతిని ఇవ్వనుందనే అంచనాలు ఉన్నాయి.