Ghaati: 'ఘాటీ' మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్న రానా.. ప్రమోషన్లకు సాయం చేయనున్న ప్రభాస్
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి, తన ముద్దు పేరు స్వీటి. ఈ పేరు అంతగా పరిచయాలు అవసరం లేకుండా అలవాటు అయ్యింది.
కెరీర్ ప్రారంభంలో గ్లామర్ డాల్‌గా తన ప్రత్యేకతను చాటుకున్న అనుష్క, 'అరుంధతి' సినిమా తర్వాత తన పాత్రలపై పంథా మార్పు తీసుకొచ్చింది.
ప్రస్తుతం,డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో 'ఘాటి' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.
'ఘాటి' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.
వివరాలు
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం
'వేదం'సినిమా తరువాత క్రిష్-అనుష్క కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం,ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది.
ఈ చిత్రంలో అనుష్క పాత్ర చాలా స్టన్నింగ్,రూత్‌లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయింది.
వచ్చే షెడ్యూల్‌లో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు క్రిష్.ఈ క్లైమాక్స్ షూట్ ను జనవరి చివరలో తీసే అవకాశం ఉంది.
ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఒక సినిమా చేస్తోంది.ఆ సినిమాతో బాటు'ఘాటి'లో కూడా ఆమె నటిస్తున్నారు.
ఈచిత్రానికి సంబంధించిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పర్చింది.
డైరెక్టర్ క్రిష్,ఈ చిత్రంలో అనుష్క మాస్ యాంగిల్‌ను మరోసారి ఆవిష్కరించనున్నారు.
వివరాలు
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్
అనుష్కచేసిన 'అరుంధతి', 'రుద్రమదేవి'సినిమాల మాదిరి,'ఘాటి' కూడా ఆమెకు మంచి క్రేజ్ తెచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
'ఘాటి' సినిమా విడుదల తేదీ ఏప్రిల్ 18 గా లాక్ చేయబడింది.మొదట ప్రభాస్ 'రాజా సాబ్' చిత్రాన్ని ఆ సమయంలో విడుదల చేయాలని భావించినప్పటికీ,ఆ సినిమా వాయిదా పడిపోవడంతో 'ఘాటి' చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళుతున్నారు.
ఇంకా,'ఘాటి'లో ఒక ప్రత్యేక గెస్ట్ రోల్ ఉందని,ఆ పాత్రలో ఒక ప్రముఖ హీరో నటిస్తున్నాడని ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి.
తాజా అప్‌డేట్ ప్రకారం,ఈ పాత్రలో రానా దగుపాటి కనిపించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి.'ఘాటి'సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.