Ranabali: విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రన్‌టైమ్ ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'రణబాలి' ఒకటి. యువ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ హిస్టారికల్ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రణబాలి' ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్‌తో పాటు దాని రన్‌టైమ్‌ను కూడా అధికారికంగా ఖరారు చేశారు.
వివరాలు
3 నిమిషాల 47 సెకన్ల నిడివి గల ట్రైలర్
త్రిశూలం చేత పట్టుకుని విజయ్ దేవరకొండ కనిపిస్తున్న పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. ట్రైలర్ 3 నిమిషాల 47 సెకన్ల నిడివితో ఉండనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 8న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ఈ హై వోల్టేజ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
దీంతో మరో రోజులో 'రణబాలి' విధ్వంసం మొదలు కానుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ మూవీపై ట్రైలర్‌తో మరింత హైప్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
'రణబాలి' ట్రైలర్ నిడివి.. మూడు నిమిషాల నలభై ఏడు సెకన్లు..
— Mega Abhimani (@megaabhimani3) October 7, 2026
నా లెక్క ప్రకారం రేపటి నుండి ఈ సినిమా గురించి డబుల్ మాట్లాడుకుంటారు 'రణబాలి' ట్రైలర్ చూసి.. #RanabaaliTrailer out tomorrow
(October 8th) at 6.03 PM #NeverForget#RanabaaliOnOct16th@TheDeverakonda @iamRashmika pic.twitter.com/ClBzCapXlI