రానా దగ్గుబాటి హిరణ్య కశ్యప నుండి రిలీజైన కాన్సెప్ట్ టీజర్
యాక్టర్ ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి హిరణ్యకశ్యప అనే ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని సాండియాగో కామిక్ కాన్ 2023 ఈవెంట్ వేదికగా ఈ ప్రాజెక్టును రానా దగ్గుబాటి ప్రకటించాడు. తన సొంత బ్యానర్ స్పిరిట్ మీడియా హిరణ్యకశ్యప ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలియజేశాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా వదిలాడు. పోస్టర్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే తాజాగా హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ నుండి మరొక అప్డేట్ వచ్చింది. హిరణ్యకశ్యప కాన్సెప్ట్ టీజర్ ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా రానా దగ్గుబాటి విడుదల చేశాడు.
త్రివిక్రమ్ రచనా సహకారంతో హిరణ్యకశ్యప
ఈ టీజర్ లో కేవలం డ్రాయింగ్స్ మాత్రమే కనిపించాయి. కామిక్స్ రూపంలో విడుదల చేసిన హిరణ్యకశప కాన్సెప్ట్ టీజర్ ఆసక్తిగా కనిపిస్తోంది. రానా దగ్గుబాటి సొంత నిర్మాణ సంస్థలో రూపొందుతున్న హిరణ్యకశ్యప ప్రాజెక్టు కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచన సహకారాన్ని అందిస్తున్నారు. అదలా ఉంచితే, హిరణ్యకశ్యప అనే సినిమాను ముందుగా రానా దగ్గుబాటి హీరోగా గుణశేఖర్ రూపొందించాలని అనుకున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చింది. మరేమైందో తెలియదు కానీ సడెన్ గా హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ లోకి త్రివిక్రమ్ వచ్చారు. ఈ విషయమై మరింత సమాచారం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.