Ranbir Kapoor : యానిమల్ నుంచి రాముడిగా రణ్ బీర్ కపూర్.. వివరాలివే
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్థాయిలో 'యానిమల్' సినిమా చేసిన రణ్ బీర్ కపూర్ వైల్డ్'గా యాక్షన్ సీన్స్ చేశారు.
డైరెక్టర్ సందీప్ వంగా సారథ్యంలో తెరకెక్కించిన యానిమల్ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది.
తాజాగా హింసాత్మకమైన మూవీకి పూర్తి భిన్నంగా సుగుణాభిరాముడి పాత్రలో ఒదిగిపోనున్నారు. శ్రీరామచంద్రుడిగా బాలీవుడ్'లో రామాయణంపై మరో సినిమా తెరకెక్కనున్నంది.
అయితే ప్రస్తుతం రణ్ బీర్ రామాయణం ప్రాజెక్టులో పనులు వేగవంతమైనట్లు సమాచారం. 2024 వేసవి నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది.
మరోవైపు ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని టాక్.
details
నితేశ్ తివారీకి రామాయణం బాధ్యతలు
ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ టాక్ వైరల్ అయ్యింది. యానిమల్'లో ఆల్ఫా క్యారెక్టర్ చేసిన రణ్ బీర్ ఆదిపురుషుడిగా కనిపించబోతున్నారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ పాత్రని పోషించేందుకు రణబీర్ పూర్తిగా గెటప్ మారుస్తున్నారట.ఇప్పట్నుంచే రణ్ బీర్ మద్యం, మాంసం తినడం మానేశారట.
దంగల్ బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన నితేశ్ తివారీ ఈ సినిమా బాధ్యతలు తీసుకోనున్నారని తెలుస్తోంది.