Loading...
Ramayana: మస్క్‌ ప్లైయింగ్‌ కారుపై రణ్‌ బీర్‌ కపూర్‌ సెటైర్
మస్క్‌ ప్లైయింగ్‌ కారుపై రణ్‌ బీర్‌ కపూర్‌ సెటైర్

Ramayana: మస్క్‌ ప్లైయింగ్‌ కారుపై రణ్‌ బీర్‌ కపూర్‌ సెటైర్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 01, 2026
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా ప్రమోషన్లలో రణ్‌ బీర్‌ కపూర్‌ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఎగిరే కార్ల ఆలోచనపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. రామాయణంలో వేల ఏళ్ల క్రితమే పుష్పక విమానం ఉందంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. నవంబర్‌ 5న విడుదలకు సిద్ధమవుతున్న 'రామాయణం' ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు నితేశ్‌ తివారీ, యశ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో కలిసి రణ్‌బీర్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు రాముడి పాత్ర తనపై చూపిన ప్రభావాన్ని కూడా పంచుకున్నారు.

Details

రాముడి పాత్ర.. జీవితంలో మార్పు

రాముడి పాత్ర పోషించే అవకాశం రావడం తన అదృష్టమని రణ్‌బీర్‌ అన్నారు. జీవితంలో ఒక్కసారే దక్కే అరుదైన అవకాశం ఇదని పేర్కొన్నారు.

ఒక మంచి సోదరుడు, భర్త, తండ్రి, స్నేహితుడు ఎలా ఉండాలో రాముడి జీవితం నేర్పుతుందని చెప్పారు. ఈ పాత్ర ద్వారా రాముడి గొప్పతనాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకున్నానని ఆయన మాటల్లో స్పష్టమైంది.

పుష్పక విమానం ప్రస్తావనతో చేసిన సరదా వ్యాఖ్య కూడా ఇంటర్వ్యూలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Details

రావణుడు-జటాయువు పోరాటానికి ఆరున్నరేళ్లు

సినిమాలోని కీలక ఘట్టాల రూపకల్పన వెనుక ఎంత శ్రమ ఉందో దర్శకుడు నితేశ్‌ తివారీ వివరించారు.

రావణుడు, జటాయువు మధ్య యుద్ధ సన్నివేశాన్ని రూపొందించడానికి సుమారు ఆరున్నరేళ్లు పట్టిందని తెలిపారు.

వేలాది మంది సాంకేతిక నిపుణులు, కార్మికులు ఈ ఘట్టం కోసం పనిచేశారని చెప్పారు. అలాగే పుష్పక విమానం రూపకల్పనకు రెండేళ్లు కేటాయించామని, దాదాపు 40 నుంచి 50 డిజైన్లు పరిశీలించిన తర్వాత తుది రూపాన్ని ఖరారు చేశామని వెల్లడించారు.

ADVERTISEMENT

Details

అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై భారీ అంచనాలు

నవంబర్‌ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే 200కు పైగా నగరాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు సమాచారం.

శనివారం ఉదయం నాటికి భారత్‌లో సుమారు 4 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారా రూ.20 కోట్లు, విదేశాల్లో మరో రూ.20 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ లెక్కల ప్రకారం ప్రీ-రిలీజ్‌ బుకింగ్స్‌ రూ.40 కోట్లకు చేరినట్లు ట్రేడ్‌ అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇవి అధికారికంగా ధృవీకరించిన వసూళ్లు కావు.

సినిమా విడుదలకు ముందే రామాయణంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏ స్థాయిలో ఉందో ఈ అంచనాలు తెలియజేస్తున్నాయి.

ADVERTISEMENT