LOADING...
Dhurandhar 2 : తొలి రోజే కలెక్షన్లతో అదరగొట్టిన 'ధురంధర్ 2'..ఎన్ని కోట్లు వచ్చాయంటే..
తొలి రోజే కలెక్షన్లతో అదరగొట్టిన 'ధురంధర్ 2'..ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Dhurandhar 2 : తొలి రోజే కలెక్షన్లతో అదరగొట్టిన 'ధురంధర్ 2'..ఎన్ని కోట్లు వచ్చాయంటే..

వ్రాసిన వారు Moogati Shabari
Mar 20, 2026
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

రణవీర్ సింగ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ధురంధర్ కు కొనసాగింపుగా రూపొందిన 'ధురంధర్: ది రివెంజ్' మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1300 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్, అలాగే కథపై ఉన్న అంచనాల కారణంగా, రెండో భాగానికి ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయకపోయినా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మొదట ఈ చిత్రాన్ని కేవలం హిందీ భాషలోనే విడుదల చేశారు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్‌కే గణనీయమైన బుకింగ్స్ నమోదయ్యాయి.

వివరాలు

భారీ కలెక్షన్లతో దూకుడు

బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రీమియర్ షోలు, మొదటి రోజు కలిపి ఈ చిత్రం దాదాపు రూ.172 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో కేవలం ప్రీమియర్ షోల నుంచే సుమారు రూ.43 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొదటి రోజు దాదాపు రూ.130 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు అంచనా. దేశవ్యాప్తంగా సుమారు 33 వేలకుపైగా షోలు ప్రదర్శించబడ్డాయి. హిందీ వెర్షన్ ఒక్కటే మొదటి రోజే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది.

వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో 2 వేల షోలు

తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2 వేల షోలు ప్రదర్శించగా, కేవలం హిందీ భాషలోనే దాదాపు 3 కోట్ల వసూళ్లు సాధించింది. ఒకవేళ ఈ సినిమా ప్రారంభం నుంచే తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలై ఉంటే, మరో రూ.10 కోట్ల వరకు అదనంగా వసూళ్లు పెరిగేవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అధికారికంగా మేకర్స్ కలెక్షన్లను ప్రకటించలేదు. భారతదేశంలో తొలి రోజు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ప్రస్తుతం పుష్ప2 మూవీ రూ. 294 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. దాని తరువాత RRR, బాహుబలి, కల్కి వంటి చిత్రాలు ఉన్నాయి.

Advertisement