Page Loader
RAPO22: రామ్ 22 .. భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్
రామ్ 22 .. భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్

RAPO22: రామ్ 22 .. భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2025
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా, ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న 22వ చిత్రం ఇది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ "సాగర్" అనే పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర లుక్ ఇటీవల విడుదల అయింది. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా, ఈ రోజు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడం జరిగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్ 

వివరాలు 

'మన సాగర్ గాడి లవ్వు ..మహా లక్ష్మి' ట్యాగ్‌లైన్‌

'మన సాగర్ గాడి లవ్వు ..మహా లక్ష్మి' అనే ట్యాగ్‌లైన్‌తో, హీరో-హీరోయిన్ల జంటను చూపించిన పోస్టర్‌ను విడుదల చేశారు. భాగ్యశ్రీ బోర్సే తన ట్రెడిషనల్ లుక్కులో కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తుండగా,రామ్ పోతినేని క్యూట్‌గా దర్శనమిచ్చారు. ఇంకా,ఈ సినిమా టైటిల్ నిర్ణయించలేదు.కానీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమై, విజయవంతంగా పూర్తయింది. రామ్,ఇతర ప్రధాన నటీనటులతో కలిసి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

వివరాలు 

అక్కటుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే లుక్

రామ్ పోతినేని"సాగర్"పాత్రలో తన నటనను వినూత్నంగా ప్రదర్శించారని,ఇది ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుందని తెలుస్తోంది. ఆయన నటన ప్రేక్షకులను నోస్టాల్జియాలోకి తీసుకెళ్లి, ఆ పాత్రలో వారు తమను తాము చూడగలుగుతారని అంచనా. ఈ సినిమా కోసం భాగ్యశ్రీ బోర్సే లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్, భాగ్యశ్రీ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా హైలైట్‌గా మారిపోతాయని యూనిట్ అంచనా వేస్తోంది. ఇక, ఈ చిత్రానికి సంగీతం వివేక్ - మెర్విన్ జంట అందిస్తున్నారు.