Rashmi Gautam: కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ? కుర్రాడు అదిరిపోయాడు!
బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ (Anchor Rashmi) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా రాణిస్తోంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ అభిమానులను మెప్పిస్తోంది. ఇదిలా ఉండగా, కొంతకాలంగా రష్మీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఒరిస్సాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈటీవీ లో రష్మీ పెళ్లి పార్టీ అని ఒక ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రష్మీ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.
సుధీర్ పరిస్థితి ఏంటని కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్
ప్రతి అమ్మాయికి కాబోయే భర్త ఇలా ఉండాలని ఇమాజినేషన్స్ ఉంటాయని తన ఇమాజినేషన్ లో ఉన్న వ్యక్తి ఇతనే అని రష్మీ చెప్పుకొచ్చింది. అయితే వీరి జంట చూడటానికి చూడముచ్చటగా ఉంది దీంతో ఈ ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది. ఆ అబ్బాయి ఎవరు? రష్మీ నిజంగానే అతడిని పెళ్లి చేసుకుంటుందా? మరి సుధీర్ పరిస్థితి ఏంటని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పూర్తి సమాచారం తెలియాలంటే డిసెంబర్ 31 వరకు అగాల్సిందే.