Page Loader
Vijay-Rashmika :మరోసారి స్క్రీన్ పై రష్మిక, విజయదేవరకొండ.. అభిమానుల్లో ఆనందం
మరోసారి స్క్రీన్ పై రష్మిక, విజయదేవరకొండ.. అభిమానుల్లో ఆనందం

Vijay-Rashmika :మరోసారి స్క్రీన్ పై రష్మిక, విజయదేవరకొండ.. అభిమానుల్లో ఆనందం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2024
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'గీత గోవిందం' సినిమాలో వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఆకట్టుకున్న తర్వాత, వీరిద్దరిపై మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ప్రచారం కొనసాగుతుంది. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ఊహగానాలు విన్పిస్తున్నాయి. ఈ జంట పండగల సమయంలో కలిసి ఉండడం, కలిసి వెకేషన్‌కి వెళ్లడంతో ఈ వార్తలకు బలం చేకూరుతున్నాయి. అభిమానులు ఈ జంటను మరోసారి స్క్రీన్‌పై చూడాలనే కోరికతో ఉన్నారు. అయితే దీనిపై ఓ తాజా అప్‌డేట్ వచ్చింది.

Details

ఇంకా స్పందించిన చిత్ర యూనిట్

'శ్యామ్ సింగ రాయ్' ఫేమ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక సాంగ్ ఉండనుంది. ఈ సాంగ్‌ కోసం రష్మిక మందన్నా ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ మధ్య మంచి స్నేహం ఉందని, ఈ ప్రత్యేక సాంగ్‌లో పాల్గొనడానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.