Rashmika : జపాన్ వేదికపైకి రష్మిక మందన్న..నేషనల్ క్రష్ రికార్డ్
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంతర్జాతీయ వేదికలపై భారత గౌరవాన్ని మరోసారి ప్రతిబింబించారు. జపాన్‌లో జరిగే ప్రతిష్టాత్మక క్రంచీరోల్ యానిమే అవార్డ్స్లో వరుసగా రెండోసారి ప్రెజెంటర్‌గా ఎంపిక కావడం ద్వారా ఆమెకు అరుదైన ఘనత లభించింది. 2024లో ఈ అవార్డుల వేదికపై ఇప్పటికే మెరిసిన రష్మిక, ఇప్పుడు మళ్లీ అదే వేదికపై కనిపించబోతోంది. ఫలితంగా, రెండు సార్లు ప్రెజెంటర్‌గా వ్యవహరించిన తొలి భారతీయ సినీ వ్యక్తిగా రష్మిక మందన్న చరిత్ర సృష్టించారు. ఈసారి క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 10వ ఎడిషన్ మే 23న టోక్యోలో అంగరంగ వైభవంగా జరగనుంది.
వివరాలు
నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ అదుర్స్
యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో ప్రతిభ కనబరిచిన కళాకారులను సత్కరించే ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం కలిగినది. ఈ వేడుకలో హాలీవుడ్ ప్రముఖులతో కలిసి రష్మిక విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ఆమె పాల్గొనటం వల్ల భారతీయ ప్రేక్షకులలో ఈ ఈవెంట్ పట్ల ఆసక్తి మరింత పెరిగింది. 'పుష్ప్' సినిమాలో 'శ్రీవల్లి' పాత్ర ద్వారా రష్మిక మందన్నకు జపాన్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది. అక్కడి ప్రేక్షకులు ఆమె నటన సామర్థ్యానికి ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ అభిమానులు ఏర్పడారు.
వివరాలు
వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీ..
ప్రస్తుతం రష్మిక వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'మైసా', 'రణబాలి' వంటి భారీ అంచనాలున్న సినిమాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోగా, ఆమె కెరీర్ కొత్త ఎత్తులకు చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రష్మిక మందన్న అంతర్జాతీయ వేదికలపై వరుస అవకాశాలను అందుకుంటూ గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్నారు. భారతీయ నటీమణులకీ ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పడానికి ఆమె మరో ఉదాహరణగా నిలుస్తున్నారు.