Loading...
Vijay deverakonda: విజయ్ దేవరకొండ ఫొటోకు రష్మిక క్రెడిట్.. వైరల్ అవుతున్న సరదా సంభాషణ
విజయ్ దేవరకొండ ఫొటోకు రష్మిక క్రెడిట్.. వైరల్ అవుతున్న సరదా సంభాషణ

Vijay deverakonda: విజయ్ దేవరకొండ ఫొటోకు రష్మిక క్రెడిట్.. వైరల్ అవుతున్న సరదా సంభాషణ

వ్రాసిన వారు Moogati Shabari
Aug 20, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సోషల్ మీడియాలో సరదాగా చేసిన కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఓ ఫ్యామిలీ ఫొటోకు రష్మిక చేసిన ఫన్నీ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షాలకారణంగా షూటింగ్ రద్దు కావడంతో విజయ్ ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి సేదతీరాడు. గోవర్ధన్ రావు, మాధవి దేవరకొండల మధ్య పడుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "వర్షాల కారణంగా షూటింగ్ రద్దయ్యింది. చిన్నప్పుడు నాకు ఇష్టమైన ప్రదేశంలో మధ్యాహ్నం నిద్ర దొరికింది" అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోను తన భార్య రష్మిక మందన్న తీసిందని చెబుతూ ఆమెకు ఫొటో క్రెడిట్ కూడా ఇచ్చాడు.

వివరాలు

రష్మిక పోస్టు వైరల్..

విజయ్ పోస్టుపై రష్మిక వెంటనే స్పందించింది. తన భర్తను సరదాగా ఆటపట్టిస్తూ కామెంట్ చేసింది.

"నేను ఇంటికి వచ్చాక నా పప్పీ ఐస్ చూడలేకే నాకు క్రెడిట్ ఇచ్చావా?" అంటూ ఫన్నీగా ప్రశ్నించింది.

అంతేకాదు.. ఇన్నేళ్లుగా తాను తీసిన మిగతా ఫొటోలకు కూడా క్రెడిట్ ఇవ్వాలని కోరింది.

తన ఫొటోగ్రఫీ టాలెంట్‌ను తాను చూపిస్తున్నానంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను నవ్విస్తున్నాయి.

వివరాలు

అట్లీతో మూవీ..

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం 'రణబలి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక రష్మిక విషయానికొస్తే.. ఆమె ఇటీవల 'కాక్‌టెయిల్ 2'లో కనిపించింది.

ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'రాక' సినిమాలో నటిస్తోంది.

ADVERTISEMENT