Page Loader
Rashmika: థాంక్యూ మై డియర్.. అల్లు అర్జున్‌కు సిల్వర్‌‌ను కానుకగా ఇచ్చిన నేషనల్ క్రష్
థాంక్యూ మై డియర్.. అల్లు అర్జున్‌కు సిల్వర్‌‌ను కానుకగా నేషనల్ క్రష్

Rashmika: థాంక్యూ మై డియర్.. అల్లు అర్జున్‌కు సిల్వర్‌‌ను కానుకగా ఇచ్చిన నేషనల్ క్రష్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2024
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు అల్లు అర్జున్‌, నటి రష్మిక మందన్నా 'పుష్ప ది రూల్‌' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీపావళి సందర్భంగా అల్లు అర్జున్‌కు రష్మిక ప్రత్యేకంగా ఓ కానుకను పంపించారు. అల్లు అర్జున్‌ ఈ కానుక గురించి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. వెండి కానుక అందితే అదృష్టం వరిస్తుందని తన అమ్మ చెప్పుతుండేదని, ఈ వెండి వస్తువు, స్వీట్స్‌ ఎక్కువ లక్‌, పాజిటివిటీ, ప్రేమ తెచ్చిపెడతాయని నమ్ముతున్నానని రష్మిక పంపించిన సందేశాన్ని పంచుకున్నారు. దానికి అల్లు అర్జున్‌ స్పందించారు. థాంక్యూ మై డియర్‌.. ఇప్పుడు మరింత అదృష్టం కావాలని కోరుకుంటున్నానని రాశారు.

Details

డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్

ఈ సందర్భంగా, రష్మిక మాట్లాడుతూ బాక్సాఫీస్‌ వద్ద 'పుష్ప' తప్పకుండా రూల్‌ చేస్తుందని, తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందన్నారు. ఆ విషయంలో తాను ఎంతో నమ్మకంతో ఉన్నానని రష్మిక చెప్పింది. ప్రస్తుతం, 'పుష్ప ది రూల్‌' చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.