రష్మికను మేనేజర్ మోసం చేశాడనే పుకార్లపై క్లారిటీ ఇదిగో
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను తన మేనేజర్ మోసం చేసి 80 లక్షల రూపాయలు తీసుకెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై రష్మిక మందన్న, తన మేనేజర్ సంయుక్తంగా స్పందించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వృత్తిపరమైన బిజీ కారణంగానే రష్మిక దగ్గర పనిచేయడం కుదరక విడిపోయినట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వీళ్ళిద్దరూ వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్, తెలుగులో పుష్ప 2, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా యానిమల్ సినిమాలో తన భాగం చిత్రీకరణ పూర్తయిందని తెలియజేసింది.