Page Loader
Rashmika Mandanna:  ఏసుబాయిగా నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా.. Chhava ట్రైలర్‌ లాంచ్ టైం ఫిక్స్
ఏసుబాయిగా నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా.. Chhava ట్రైలర్‌ లాంచ్ టైం ఫిక్స్

Rashmika Mandanna:  ఏసుబాయిగా నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా.. Chhava ట్రైలర్‌ లాంచ్ టైం ఫిక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుష్ప ప్రాంఛైజీతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న (Rashmika Mandanna) తన గ్లామరస్‌ పాత్రలతో పాటు నటనకు ఆస్కారమున్న రోల్స్‌లో మెరుస్తూ , టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. రష్మిక ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి, అందులో ఈ భామ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి Chhava. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో, రష్మిక ఛత్రపతి శివాజీ సతీమణి మహారాణి ఏసుబాయిగా కనిపించబోతోంది. చిత్రబృందం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

వివరాలు 

మరాఠి భాష నేర్చుకుంటున్న రష్మిక

"ప్రతి గొప్ప రాజు వెనుక అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వపడే మహారాణి యేసుబాయి పాత్రను పోషించడం గర్వంగా ఉంది,"అంటూ రష్మిక తన పాత్ర లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ,ఈ మూవీ ట్రైలర్ రేపు విడుదలవుతుందని ప్రకటించింది. పోస్టర్ ద్వారా ఈ సినిమాలో రష్మిక పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో చూపుతోంది. ఈ సినిమా కథానుగుణంగా పూర్తిగా మరాఠి భాషలో సాగనుందని సమాచారం. రష్మిక ఇందుకోసం మరాఠి భాష నేర్చుకున్నట్టు తెలుస్తోంది.మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఏఆర్ రెహమాన్. రష్మిక తన పాత్రకు న్యాయం చేస్తుందనడంలో సందేహమే లేదని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు!

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్మిక చేసిన ట్వీట్