LOADING...
Rashmika Mandanna: ఆ భయాన్ని అధిగమించిన రష్మిక.. గాయాలైనా షూటింగ్ ఆపలేదుగా..!
ఆ భయాన్ని అధిగమించిన రష్మిక.. గాయాలైనా షూటింగ్ ఆపలేదుగా..!

Rashmika Mandanna: ఆ భయాన్ని అధిగమించిన రష్మిక.. గాయాలైనా షూటింగ్ ఆపలేదుగా..!

వ్రాసిన వారు Moogati Shabari
May 14, 2026
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం కొచ్చిలో జరుగుతున్న 'మైసా' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న నటి రష్మిక మందన్న, తనకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఎత్తుల భయాన్ని జయించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒక కీలక సన్నివేశం కోసం ఆమె ఎలాంటి డూప్ సహాయం లేకుండా సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి దూకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా చేతులు, కాళ్లకు గాయాలు అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా షూటింగ్‌ను కొనసాగించడం ఆమె పనిపట్ల ఉన్న నిబద్ధతను చూపిస్తోంది.

వివరాలు

అడవుల మధ్య ట్రెక్కింగ్..

అడవుల మధ్య, ట్రెక్కింగ్‌లు చేస్తూ, వర్షాల్లో సాగిన ఈ చిత్రీకరణ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని రష్మిక పేర్కొన్నారు. ఇక మరోవైపు, రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ జంట సోషల్ మీడియాలో భారీ ఆదరణ పొందుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన ఒక కమర్షియల్ ప్రకటన ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లైక్స్ పొందిన రెండో ప్రకటనగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 11.5 మిలియన్ల లైక్స్‌తో మొదటి స్థానంలో ఉన్న ప్రకటన కూడా ఇదే జంటకు సంబంధించినదే కావడం. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి 'రణబాలి' చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement