Page Loader
శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన  రష్మిక మందన్న
పుష్ప: ది రూల్‌లో శ్రీ వల్లిగా రష్మిక మందన్న

శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న

వ్రాసిన వారు Nishkala Sathivada
Apr 05, 2023
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ రాబోయే చిత్రం పుష్ప: ది రూల్‌లో రష్మిక మందన్న తన శ్రీవల్లి పాత్రని తిరిగి పోషించడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు, ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా బృందం రష్మిక శ్రీవల్లిగా ఉన్న కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు, పోస్టర్ లో పార్ట్ 1 కన్నా ఆమె చాలా అందంగా కనిపించింది. చిత్ర నిర్మాతలు ట్విట్టర్‌లోకి వెళ్లి రష్మిక ని ట్యాగ్ చేస్తూ శ్రీవల్లి పాత్రలో ఉన్న రష్మిక మందన్న కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఆమె లంగా వోణిలో ఎర్రటి బొట్టుతో అచ్చమైన తెలుగు అమ్మాయిలా అందంగా కనిపిస్తోంది. అభిమానులు పోస్టర్‌పై లైక్స్ రూపంలో ప్రేమను కురిపిస్తున్నారు. ఈ భాగంలో శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుందో అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్మిక పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్