Page Loader
Rashmika: 'విజ్జూ' అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చిన రష్మిక.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా విజయ్‌-రష్మిక జంట!
'విజ్జూ' అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చిన రష్మిక.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా విజయ్‌-రష్మిక జంట!

Rashmika: 'విజ్జూ' అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చిన రష్మిక.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా విజయ్‌-రష్మిక జంట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో కొన్ని జంటలు ప్రేమలో ఉన్నప్పటికీ అందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే సీక్రెట్‌గా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు అనిపిస్తున్నాయి. అలాంటి జంటలలో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పేర్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. కొంతకాలంగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించడం, ఆ తర్వాత ఆ విషయంపై ఎలాంటి స్పందన లేకపోవడం ఇవన్నీ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి. దీంతో వీరిద్దరూ త్వరలో తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించనున్నారనే ప్రచారాలు బలంగా వినిపించాయి. తాజాగా రష్మిక మందన్న తన లేటెస్ట్ మూవీ 'మైసా' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌కి విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.

Details

గర్వపడేలా చేస్తాను

ఇది అద్భుతంగా ఉండబోతోందంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టర్‌ను షేర్ చేశాడు. దీన్నే రష్మిక వెంటనే రీషేర్ చేస్తూ విజ్జూ.. ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అంతే కాకుండా, హార్ట్ ఎమోజీని కూడా జత చేసింది. దీంతో అభిమానుల ఊహలు మరోసారి ఊపందుకున్నాయి. ఇది తొలిసారి కాదు. గతంలోనూ విజయ్-రష్మికలు కలిసి వెకేషన్‌కి వెళ్లినట్లు ఫొటోలు వైరలయ్యారు. ఇద్దరూ తరచూ ఒకరినొకరు సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తూ పోస్టులు పెడుతూ ఉండటం చూస్తే వీరిద్దరి మధ్య బంధం కేవలం స్నేహమేనా? లేక ప్రేమాయణమా? అనే చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి.