Rashmika Mandanna: రష్మిక బర్త్‌డే స్పెషల్.. 'మైసా' నుంచి మాస్ పోస్టర్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మైసా' రూపొందుతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో రష్మిక లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్‌తో అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, నేడు రష్మిక జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వివరాలు
ఫుల్ మాస్ యాక్షన్ అవతారంలో రష్మిక
పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో వచ్చిన ఈ పోస్టర్‌లో రష్మిక ఫుల్ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇప్పటివరకు చేయని కొత్త తరహా పాత్రలో రష్మిక నటించనుంది. ఈ చిత్రాన్ని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా, రష్మిక మరో ప్రాజెక్ట్‌లో కూడా బిజీగా ఉంది. విజయ్ దేవరకొండతో కలిసి 'రణబలి' సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.