LOADING...
Rashmika Mandanna : రష్మిక బర్త్‌డే స్పెషల్.. 'రణబాలి' టీమ్ నుంచి జయమ్మకు సర్‌ప్రైజ్
రష్మిక బర్త్‌డే స్పెషల్.. 'రణబాలి' టీమ్ నుంచి జయమ్మకు సర్‌ప్రైజ్

Rashmika Mandanna : రష్మిక బర్త్‌డే స్పెషల్.. 'రణబాలి' టీమ్ నుంచి జయమ్మకు సర్‌ప్రైజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్మిక మందన్న 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, ఇప్పుడు నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. నేడు (ఏప్రిల్ 5) ఆమె తన 30వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'రణబలి' టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ చిత్రంలో రష్మిక 'జయమ్మ' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. "తమ ఆకర్షణతో, వెలిగిపోయే చిరునవ్వుతో ప్రపంచానికి రంగులు అద్దే మా జయమ్మ అలియాస్ రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ చిత్రబృందం షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాలు

జయమ్మ పాత్రలో రష్మిక

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన రాయలసీమ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో కనిపించనున్నాడు. రష్మిక పోషిస్తున్న 'జయమ్మ' పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందని సమాచారం. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement